'360 డిగ్రీ' కెమెరాను ఆవిష్కరించిన శాంసంగ్!
- 17 లెన్స్‌లతో కెమెరా తయారీ
- నెలాఖరులోగా మార్కెట్లోకి
- ఇంకా ధర వెల్లడించని కంపెనీ
అలాగే కూలింగ్ ఫ్యాన్ కూడా అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఇతర కెమెరాలతో పోల్చినపుడు ఇది తక్కువ బరువు ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది. ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్ సాయంతో చిత్రాలన్నింటిని కలిపి 360 డిగ్రీ ప్రభావాన్ని ఈ కెమెరా సృష్టిస్తుంది. దీనిని ల్యాన్, యూఎస్‌బీల ద్వారా కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది. 10 జీబీ ర్యామ్, 40 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇందులో ఉన్నాయని శాంసంగ్ పేర్కొంది. ఈ నెలాఖరులోగా 360 డిగ్రీ కెమెరాను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీని ధరను శాంసంగ్ కంపెనీ వెల్లడించలేదు.