జనవరి నుంచి సెట్స్ పైకి విజయ్ దేవరకొండ!

వరుస హిట్స్ తో విజయ్ దేవరకొండ మాంచి ఉత్సాహంతో వున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. అందులో ఒక ప్రాజెక్టు జనవరిలో సెట్స్ పైకి వెళుతోంది. విజయ్ దేవరకొండతో 'పెళ్లి చూపులు' చేసిన నిర్మాణ సంస్థ ఆయన బంధువులదే.

ఇదే సంస్థ విజయ్ దేవరకొండతో మరో సినిమాను చేయడానికి రంగాన్ని సిద్ధం చేసింది. నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా, వాళ్లు ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి మైత్రీ మూవీస్ కి అప్పగించారు. ఇప్పుడు ఈ సినిమాకి మైత్రీ మూవీస్ వాళ్లే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర .. 'అర్జున్  రెడ్డి' పాత్రకి చాలా దగ్గరగా వుంటుందట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


More Telugu News