కళ్లతోనే పలకరించుకున్న వైఎస్ జగన్, సబితా ఇంద్రారెడ్డి... గాలికి షేక్ హ్యాండ్!
- నేడు నాంపల్లి కోర్టులో ఓబులాపురం గనుల కేసు విచారణ
- విచారణకు వచ్చిన గాలి, సబితా, శ్రీలక్ష్మి
- ఒకరికి ఒకరు తారసపడ్డ వైఎస్ జగన్ తదితరులు
- కోర్టు వద్ద భారీ బందోబస్తు
ఈ కేసుల విచారణ ఒకే ప్రాంతంలో జరగనుండటంతో వీరంతా కలిశారు. జగన్, సబితా ఇంద్రారెడ్డిలు కళ్లతోనే పలకరించుకోగా, గాలి మాత్రం జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడని సమాచారం. పలువురు వీఐపీలు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నేడు కేసు విచారణలో పాల్గొనాల్సిన నిందితులు, వారి తరఫు న్యాయవాదులను మినహా మరెవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించేది లేదని వెల్లడించారు.