పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో.. టీడీపీ భవన్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన పార్టీ మార్పు ఊహాగానాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ కార్యవర్గ సమావేశానికి బయల్దేరారు. కాసేపట్లో ఆయన టీడీపీ భవన్ కు చేరుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను బీజేపీ నేతలు కలిశారు. పలు వూహాగానాల నడుమ టీడీపీ భవన్ కు వెళ్తున్న రేవంత్ రెడ్డి విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా, టీడీపీ భవన్ లో జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ భవిష్యత్, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. 

revanth reddy
Telugudesam
hydarabad
Telugudesam bhavan

More Telugu News