'డెకాయిట్'తో కొంచెం రొమాన్స్ .. మరి కొంచెం యాక్షన్: మృణాల్!
వెండితెరపై బంగారు తీగలా కనిపించే హీరోయిన్స్ ను చూస్తూ ప్రేక్షకులు కదలడం మరిచిపోతుంటారు .. ఒక్కోసారి కథను కూడా మరిచిపోతుంటారు. హీరోయిన్స్ గ్లామరస్ గా కనిపించాలనే ఆడియన్స్ కోరుకుంటారు. ఇక పాత్రను బట్టి వాళ్ల నటన కనెక్ట్ కావడం .. కాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ గా కనిపించడం కంటే, కాస్త బరువైన .. లోతైన పాత్రలను చేయడానికే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
అలాంటి ఒక డిఫరెంట్ రోల్ తనకి 'డెకాయిట్'లో లభించినందుకు మృణాల్ ఠాకూర్ చాలా మురిసిపోతోంది. అడివి శేష్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, రేపు విడుదలవుతోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా లోతైనదిగా కనిపిస్తుందని ఆమె ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. ఒక పాపకు తల్లిగా తాను కనిపిస్తాననీ, బరువైన ఆ పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉండటం వలన, వెంటనే ఆ పాత్రలో లీనమైపోయేదానినని అన్నారు.
ఇక ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు యాక్షన్ దృశ్యాలలోను తాను నటించానని చెప్పారు. ఈ రెండింటిలో రొమాన్స్ సీన్స్ లో చేయడమే తనకి కష్టంగా తోచిందని అన్నారు. మృణాల్ ఠాకూర్ లో మంచి నటి ఉందనే విషయాన్ని 'సీతారామం' నిరూపించింది. ఆ సినిమా ఆమెకి సక్సెస్ తో పాటు, మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలేవీ మళ్లీ ఆ స్థాయిలో మాట్లాడుకునేలా చేయలేకపోయాయి. 'ది ఫ్యామిలీ స్టార్' ఆమె అభిమానులను బాగా నిరాశపరిచింది. ఆ తరువాత ఆమె నుంచి వస్తున్న ఈ సినిమా, భారీ హిట్ అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.