ఇల్లు, భూమి, కారు ఏదీ లేదు: మమతా బెనర్జీ

Mamata Banerjee Declares No House Land or Car Owns Only Gold
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సొంత ఇల్లు, భూమి లేదని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంత ఇల్లు, వ్యవసాయ భూమి, ఖాళీ స్థలం, నివాస సంబంధిత ఆస్తులు ఏమీ లేవని పేర్కొన్నారు. తనకు కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదని తెలిపారు.

కాళీఘాట్‌‍లోని 30బీ హరీశ్ ఛటర్జీ వీధిలోని నివాసాన్ని తన చిరునామాగా పేర్కొన్నారు. ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ కాలేదని తెలిపారు. తన పేరుపై రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, చేతిలో రూ.75,700 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు ఖాతాల్లో ఒకటి వ్యక్తిగత బ్యాంకు ఖాతా కాగా, రెండోది ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్న బ్యాంకు ఖాతాగా పేర్కొన్నారు. వ్యక్తిగత ఖాతాలో రూ.12,36,209 ఉండగా, రెండో ఖాతాలో రూ.40 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.

తన చరాస్థుల విలువను ఆమె రూ.15.37 లక్షలుగా వెల్లడించారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. తన వద్ద 9.75 గ్రాముల బంగారం ఉందని, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది రూ.1.75 లక్షలుగా పేర్కొన్నారు. 2025-26 సంవత్సరంలో తనకు రూ.40,600 టీడీఎస్ రిఫండ్ వచ్చినట్లు చెప్పారు. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలు తన ప్రాథమిక ఆదాయంగా వెల్లడించారు.
Go Back to Shorts
Mamata Banerjee
West Bengal
Bhabanipur
Assets Declaration
Indian Politics
Election Affidavit

More Telugu News