కమల్ ఆర్ ఖాన్ ఖాతాను నిలిపివేసిన ట్విట్టర్... పీడ వదిలిందంటున్న నెటిజన్లు
- పండగ చేసుకుంటున్న నెటిజన్లు
- పీడ వదిలిందంటూ వ్యాఖ్యలు
- సినిమాలపై వెకిలి రివ్యూలు ఇచ్చే కేఆర్కే
ఆమిర్‌ఖాన్ సినిమా `సీక్రెట్ సూపర్‌స్టార్` గురించి కేఆర్కే ఏదైనా విమర్శించాడేమోనని ఆయన ట్విట్టర్ అకౌంట్ కోసం వెతికినపుడు ఈ విషయం బయటపడింది. సాధారణంగా ట్వీట్లలో అసభ్య పదజాలాన్ని, మతాలను, భావజాలాలను కించపరిచే పదజాలం ఉన్నపుడు ట్విట్టర్ ఇలా ఖాతాలను నిలిపివేస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల ట్వీట్లను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినపుడు కూడా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది.