ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్!

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి సాక్షిగా ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి కీచకులు పాల్పడ్డారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్ కు చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ప్రియుడితో కలిసి బుధకెందు తాకూరాణి దేవాలయానికి వెళ్లింది. దేవాలయంలో పూజలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన ప్రేయసీప్రియులను రెండు బైక్ లపై వచ్చిన ఆరుగురు యువకులు అటకాయించారు.

వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రియుడిపై దాడి చేశారు. అనంతరం వారిద్దరినీ దగ్గర్లోని జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి తెగబడడమే కాకుండా, అదేదో ఘనకార్యమైనట్టు సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. దారుణం అనంతరం వారిద్దరినీ అక్కడే వదిలేయగా, వారిద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆరుగురు కీచకులను అరెస్టు చేశారు. 
Go Back to Shorts
gang rape
odisha
ganjam
lovers
temple

More Telugu News