ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా: 'ఎస్క్వైర్' మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ
- ప్రఖ్యాత ఎస్క్వైర్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
- ప్రస్తుతం జీవితంలో అత్యంత పరిపూర్ణమైన దశలో ఉన్నానన్న చరణ్
- 'పెద్ది' సినిమా కోసం ఏకంగా ఏడాదిన్నరగా కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడి
- అయ్యప్ప దీక్ష, క్రమశిక్షణ తనను ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతాయని స్పష్టం
- పిల్లలు పుట్టాక తన జీవితమే మారిపోయిందని, వారే తన ప్రాణమన్న గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ గా మెగా ఇమేజ్.. అంతే నిరాడంబరమైన వ్యక్తిత్వం... కెరీర్ పరంగా శిఖరాగ్ర స్థాయిలో, వ్యక్తిగతంగా పరిపూర్ణమైన జీవితం గడుపుతున్న వేళ.. టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చరణ్ ప్రఖ్యాత 'ఎస్క్వైర్ ఇండియా' మ్యాగజైన్ ఏప్రిల్ సంచిక కవర్‌పై మెరిశారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలోని పలు కీలక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ఫేమ్, క్రమశిక్షణ, కుటుంబ బంధాలు, తన తాత్విక దృక్పథం వంటి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు, ఆయన వ్యక్తిత్వంలోని లోతైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
ప్రపంచం తన చుట్టూ విస్తరిస్తున్నా, తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుని, అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్‌గా వెలిగిపోతూనే, తన మూలాలను మర్చిపోకుండా, కుటుంబానికి, క్రమశిక్షణకు విలువిస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
చెప్పుల్లేకుండా.. ఆత్మవిశ్వాసంతో..
ఈ ఇంటర్వ్యూ, ఫోటోషూట్ కోసం హాంకాంగ్‌లోని విలాసవంతమైన రోజ్‌వుడ్ హోటల్‌ను వేదికగా ఎంచుకున్నారు. అక్కడికి రామ్ చరణ్ వచ్చిన తీరు అక్కడి సిబ్బందిని సైతం ఆశ్చర్యపరిచింది. అత్యంత ఖరీదైన ఆ హోటల్ లాబీలోకి ఆయన చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వచ్చారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఆయన అలా రావడం వెనుక కారణం ఉన్నప్పటికీ, ఆయనలో కనిపించిన ఆత్మవిశ్వాసం, నిరాడంబరత అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి బెరుకు లేకుండా, ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటైన హాంకాంగ్‌లో, ఒక స్టార్‌గా చెప్పుల్లేకుండా తిరగడం ఆయనలోని నిగర్వి తత్వానికి నిదర్శనమని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ పేర్కొన్నారు.
ఇది నా జీవితంలో అత్యుత్తమ దశ
ప్రస్తుతం తన జీవితంలోని అన్ని పాత్రలను తాను ఎలా చూస్తున్నారని అడిగిన ప్రశ్నకు చరణ్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "నటుడు, కొడుకు, భర్త, తండ్రి, పబ్లిక్ ఫిగర్.. వీటన్నింటినీ కలిపితేనే 'రామ్'. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నా జీవితంలో పెద్ద వెలితి ఏర్పడుతుంది. ప్రస్తుతం నేను నా జీవితంలో అత్యుత్తమ దశలో ఉన్నాను. ఇది పరిపూర్ణమైన దశ" అని అన్నారు. "ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం, 14 ఏళ్ల వైవాహిక జీవితం, ముగ్గురు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండటం.. ఇవన్నీ కలిపి నా జీవితాన్ని సంపూర్ణం చేశాయి" అని నవ్వుతూ చెప్పారు.
బాధ్యత పెరిగింది.. కానీ గర్వం తగదు
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్‌డమ్ గురించి చరణ్ స్పందిస్తూ, "నిజమే, బాధ్యత పదింతలు పెరిగింది. మనం మనల్ని మాత్రమే కాదు, మన సినిమాను, మన సంస్కృతిని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. అయితే, ఈ విజయాన్ని, గుర్తింపును చూసి మనం అతిగా ఆలోచించకూడదు. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఆలోచనతో సినిమా మొదలుపెడితే అసలుకే మోసం వస్తుంది. మన కథకు, మన పనికి నిజాయతీగా ఉండాలి" అని స్పష్టం చేశారు. తాను విజయాలను కానీ, అపజయాలను కానీ ఎక్కువగా తలకు ఎక్కించుకోనని, వాటికి అతీతంగా ఉండటం అలవాటు చేసుకున్నానని తెలిపారు.
విజయం వచ్చినా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా
విజయం, కీర్తి అనేవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పెద్దవి చేస్తాయని, కానీ తాను మాత్రం తన ప్రపంచాన్ని ఉద్దేశపూర్వకంగా చిన్నదిగా చేసుకున్నానని చరణ్ ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. "నేను నాన్నగారిని (చిరంజీవి) చూస్తూ పెరిగాను. ఆయన తన కుటుంబానికి, ముఖ్యంగా తండ్రిగా తన బాధ్యతలకు సమయం కేటాయించడం కోసం స్పష్టమైన హద్దులు గీసుకోవడం చూశాను. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారికి అలాంటి హద్దులు చాలా ముఖ్యం. నేను నా విజయాలను గానీ, అపజయాలను గానీ మరీ సీరియస్‌గా తీసుకోను. పని మీద పూర్తి శ్రద్ధ పెడతాను, కానీ ఫలితానికి అతీతంగా ఉండటం అలవాటు చేసుకున్నాను" అని తెలిపారు
'పెద్ది' కోసం కఠోర శ్రమ.. ఏడాదిన్నర శిక్షణ
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం 'పెద్ది' కోసం పడుతున్న కష్టం గురించి చరణ్ వివరించారు. ఈ సినిమాలో అఖాడా రెజ్లర్ పాత్ర కోసం గత ఏడాదిన్నరగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు నుంచి ఐదు నెలల పాటు 'సుల్తాన్', 'దంగల్' చిత్రాలకు పనిచేసిన జాతీయ కోచ్ వద్ద కఠినమైన కుస్తీ శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. "ఆయన శిక్షణ చాలా కఠినంగా ఉండేది. ఒకానొక దశలో 'సార్, నేను జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడం లేదు' అని ఆయనతో సరదాగా అన్నాను" అని గుర్తుచేసుకున్నారు.
'పెద్ది' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లోని గద చాలా బరువైందని, దాన్ని తిప్పేటప్పుడు దాని శక్తికి అనుగుణంగా మనం కదలకపోతే నడుం విరుగుతుందని అన్నారు. కుస్తీలో తన నైపుణ్యానికి పదికి నాలుగు మార్కులు ఇచ్చుకుంటానని వినమ్రంగా చెప్పారు.
నా గుండె చప్పుళ్లు.. నా పిల్లలు, పెంపుడు జంతువులు
తండ్రిగా మారడం తనలో ఎలాంటి మార్పు తెచ్చిందని అడిగినప్పుడు, చరణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. "అత్యంత స్వచ్ఛమైన ఆనందం మన గుండె బయట ఉంటుంది. మన గుండెలోని ఒక భాగమే మన కళ్ల ముందు రూపంగా ఉన్నప్పుడు, దాన్ని మనం మరింత జాగ్రత్తగా చూసుకోవాలి" అని అన్నారు. తన ముగ్గురు పిల్లల రాకతో తన ఇంటి స్వరూపమే మారిపోయిందని, వారు లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోతుందని చెప్పారు.
తన పెంపుడు కుక్క రైమ్ (Rhyme) గురించి చెబుతూ, అది తన కూతురు క్లారాని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటుందని, దాని తెలివి చూస్తే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు మొదట తాను స్పందించలేదని, కానీ తన పెంపుడు కుక్క రైమ్ విగ్రహాన్ని కూడా పెడతారని భార్య ఉపాసన చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నానని చరణ్ తెలిపారు.
జీవితంలో సమయానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరిస్తూ, "సమయం ఉండటం కాదు, దాన్ని ఎంత బాగా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం. ఒకప్పుడు నా పనివేళలు, షూటింగ్ షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి దానికి ఒక అర్థం ఉండాలి. షూట్‌లో వంద శాతం కష్టపడాలి. ఇంటికి వచ్చాక బద్ధకంగా ఉండకూడదు. నా కూతురు నాపైకి దూకుతుంది, నా భార్యకు సమయం కేటాయించాలి, కుటుంబ సమస్యలు, అభిమానుల విషయాలు కూడా చూడాలి. అందుకే ప్రతిరోజూ, ప్రతి క్షణం అప్రమత్తంగా, నూటికి నూరు శాతం చురుకుగా ఉండాలి," అని చరణ్ వివరించారు.
అయ్యప్ప దీక్ష.. నన్ను రీసెట్ చేస్తుంది
తన జీవితంలో అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యతను చరణ్ వివరించారు. 17 ఏళ్ల వయసులో, సినిమాల్లోకి రాకముందు, మనసును అదుపులో ఉంచుకోవడం కోసం తన తండ్రి చిరంజీవి తనను దీక్ష చేపట్టమని ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.
"మొదట్లో ఆధ్యాత్మికంగా కాకపోయినా, క్రమశిక్షణ కోసం మొదలుపెట్టాను. ఈ దీక్ష నా ఆలోచనలను, జీవనశైలిని పునఃనిర్మించింది. నాలో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇది నా జీవితాన్ని పూర్తిగా రీసెట్ చేస్తుంది, మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది" అని అన్నారు. తాను ఏడాదికి రెండుసార్లు ఈ దీక్షను చేపడతానని, ఇది తనను అన్ని రకాల ప్రలోభాల నుంచి దూరంగా ఉంచుతుందని తెలిపారు.
వారసత్వం.. నాన్న నుంచి నేర్చుకున్నది అదే!
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎదురైన పోలికలు, ఒత్తిడి గురించి చరణ్ మాట్లాడారు. "చిన్నప్పుడు ఆ ఒత్తిడిని నేను పెద్దగా పట్టించుకోలేదు. బహుశా అదే నన్ను కాపాడింది. నేను వారసత్వంగా ఒత్తిడిని కాదు, పనితనాన్ని స్వీకరించాను. నాన్నగారు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. సమయానికి సెట్‌కు రావాలి, ఎందుకంటే మనం ఆలస్యం చేస్తే నిర్మాత డబ్బు నష్టపోతాడు. అలాగే, ఎవరైనా 50 గంటలు పనిచేస్తే, నువ్వు 100 గంటలు పనిచేయాలి.. ఇదే ఆయన నుంచి నేను నేర్చుకున్నది" అని అన్నారు.
తన పిల్లలు కూడా తమ జీవితానికి ఒక ఉద్దేశాన్ని కనుగొని, ప్రభావవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం మీద, రామ్ చరణ్ తనలోని నటుడు, కొడుకు, భర్త, తండ్రి, పబ్లిక్ ఫిగర్.. ఇలా అన్ని కోణాలను సమన్వయం చేసుకుంటూ అరుదైన ప్రశాంతతతో జీవిస్తున్నారని ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది.