వీటిని చూసి మీ అభిప్రాయం చెప్పండి.. అమరావతి 'అసెంబ్లీ' డిజైన్లను సోషల్ మీడియాలో విడుదల చేసిన సీఆర్డీఏ!
- కొత్తగా 13 రకాల డిజైన్లను రూపొందించిన నార్మన్ ఫోస్టర్
- ట్విట్టర్, ఫేస్బుక్లో విడుదల
- వారం రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ
మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, రాజమౌళి కలిసి లండన్లోని నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ డిజైన్లు ఎలా ఉండాలో రాజమౌళి సలహాలిచ్చారు. దీంతో ఆయన సలహాలు, సూచనల మేరకు సంస్థ కొత్తగా మరో 13 డిజైన్లను రూపొందించింది. సీఆర్డీఏఈ డిజైన్లను ఫేస్బుక్, ట్విట్టర్తోపాటు తమ వెబ్సైట్లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయాల వెల్లడికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 25, 26 తేదీల్లో లండన్లో మరికొన్ని డిజైన్లను పరిశీలించనున్నారు.