అల్లరి చేస్తోందని బాలికపై కూర్చున్న 145 కిలోల మహిళ.. ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి!

18-10-2017 Wed 14:56 | International
  • తమ కూతుర్ని అదుపులో పెట్టాలని సదరు మహిళకు చెప్పిన బాలిక తల్లి
  • ప్రాణాలు కోల్పోయిన బాలిక (9) బ‌రువు 33 కిలోలు
  • ఫ్లోరిడాలోని పెన్స‌కోలా ప్రాంతంలో దారుణ ఘటన
కోపం తెచ్చుకున్న‌ ఓ మ‌హిళ (64) తొమ్మిదేళ్ల బాలిక‌పై కూర్చోవ‌డంతో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఫ్లోరిడాలోని పెన్స‌కోలా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ అమ్మాయి బాగా అల్లరి చేస్తోందని ఆమెను మంద‌లిస్తూ అలా కూర్చున్నాన‌ని ఆ మ‌హిళ విచార‌ణ‌లో ఒప్పుకుంది. ఆ బాలిక బ‌రువు 33 కిలోలు కాగా ఆమెప‌ట్ల దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించిన ఆ మ‌హిళ బ‌రువు 145 కిలోలు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, త‌న కుమార్తె లిండ్సా బాగా అల్ల‌రి చేస్తోంద‌ని ఆమెను దారిలో పెట్టాల‌ని ఎడ్మండ్‌ స్మిత్ (62) అనే మ‌హిళ త‌న‌ బంధువైన వెరోనికా (64) సాయం కోరింది.

దీంతో లిండ్సాను దారిలో పెట్టాల‌ని భావించిన వెరోనికా.. ఆ బాలిక కూర్చున్న కుర్చీలోనే ఆమెపై కూర్చుంది. దీంతో ఆ బాలిక‌కు ఊపిరి ఆడ‌లేదు. ఆ బాలిక‌ అపస్మారక స్థితిలోకి చేరడంతో ఆమెను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. త‌మ కూతురు లిండ్సాను వెరోనికాయే హ‌త్య చేసింద‌ని ఆమె తల్లిదండ్రులు గ్రేస్ స్మిత్ (69), ఎడ్మండ్ స్మిత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తన కూతురు ఊపిరి ఆడటం లేదని చెప్పినప్పటికీ, నిందితురాలు త‌న కూతురిపై నుంచి లేవలేదని గ్రేస్ స్మిత్‌ తెలిపాడు. ఆ మ‌హిళ త‌న కూతురిపై దాదాపు పది నిమిషాలకుపైగా కూర్చుంద‌ని ఆరోపించాడు. పోలీసులు నిందితురాలిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆ మ‌హిళ వ‌ద్ద త‌మ‌ బాలిక‌ను విడిచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులపై కూడా కేసు న‌మోదు చేసుకున్నారు.  
అల్లరి చేస్తోందనిబాలికపై

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more