అందుకే వంట నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే వంట నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను: సమంత

  • గతంలో వంట వచ్చా అంటే తినడం వచ్చని సమాధానం చెప్పిన సమంత
  • బాధ్యత వంటబట్టించుకున్న గృహిణిలా మాట్లాడుతున్న వైనం 
  • కొత్త పెళ్లి కూతురుగా బంధువుల ఇంట విందు భోజనాలకు వెళ్తున్న ముద్దుగుమ్మ 
కొత్త పెళ్లి కూతురు సమంత వంటగదిలో గరిటె తిప్పుతానంటోంది. వివాహానికి ముందు వంట వచ్చా? అని అడిగితే తినడం వచ్చని జోక్ చేసిన సమంత, ఇప్పుడు బాధ్యత వంటబట్టించుకున్న గృహిణిలా మాట్లాడుతోంది.

గతంలో ‘నా ప్రియుడికి వంట బాగా వచ్చు. ఇక నేను నేర్చుకోవడం ఎందుకు?’ అంటూ నాగచైతన్య చేసిన వంటలను టేస్టు చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయేది. వివాహానంతరం బంధువుల ఆహ్వానం మేరకు ఆయా ఇళ్లకు వెళ్తున్న సమంత అక్కడి మహిళలు నిర్వర్తిస్తున్న బాధ్యతలు, కుటుంబం పట్ల వారు తీసుకునే కేరింగ్ వంటివి గమనిస్తోంది.

దీంతో సమంత వంట నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. త్వరలోనే వంటగదిలో ప్రవేశించబోతున్నానని, అక్కినేని ఇంట వంటలు చేస్తానని తెలిపింది. దీంతో తమ అభిమాన నటికి అప్పుడే కుటుంబ బాధ్యతలు బాగా వంటబట్టేశాయని అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, సమంత ప్రస్తుతం ‘మహానటి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
samanta
naga chitanya
marriage
party
food

More Telugu News