పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకకు గౌరు వెంకటరెడ్డి సూటి ప్రశ్న!
- ఏ అభివృద్ధి కళ్లకు కనిపించింది?
- ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తారా?
- అందుకు శిక్ష తప్పదు
- హెచ్చరించిన గౌరు వెంకటరెడ్డి
చంద్రబాబు మాయలో పడిన రేణుక విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్లుగా జరగని అభివృద్ధి వచ్చే ఏడాదిన్నరలో ఎలా జరుగుతుందో చెప్పాలని అడిగారు. బుట్టా రేణుక వంటి ఒక నేత పార్టీని వీడితే అటువంటి వారు వంద మంది వస్తారని చెప్పారు.