మరో సంస్కరణకు తెరతీయనున్న ట్రంప్.. భారతీయులకు నష్టమే
- వైద్య రంగంలో సంస్కరణకు తెరతీసిన ట్రంప్
- ఇప్పటికే వీసాలు, ఉద్యోగావకాశాలు, ఆరోగ్యబీమా, అమెరికా ప్రవేశాలు వంటి విభాగాల్లో సంస్కరణలు తెచ్చిన ట్రంప్
- డాక్టర్ రాసే చీటీపై ఇచ్చే మందుల ధరల సమీక్షకు నిర్ణయం
మందుల ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో అమ్మే మందుల ధరలను అమెరికా ప్రభుత్వం కాకుండా డ్రగ్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయని, ఈ విధానం మారాలని వైట్ హౌస్ లో కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తమ మందులను అమెరికాలో మార్కెట్ చేసుకునే భారత్ లోని డ్రగ్ కంపెనీలకు కష్టకాలం మొదలౌతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.