ఛా.. మా నాయనే... ఎవరికీ తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి!: టీడీపీ ఎమ్మెల్యేపై రామ్ గోపాల్ వ‌ర్మ చుర‌క‌లు

17-10-2017 Tue 19:18 | National
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శలు
  • ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే చూస్తూ ఊరుకోమన్న ప్రభాకర్ చౌదరి
  • ‘ఊరుకోక డాన్స్ చేస్తారా సర్? లేక పాట కూడా పాడతారా?’ అని ప్రశ్నించిన వర్మ
తాను తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విమర్శలు చేస్తోన్న నేతలకు వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరి తనను విమర్శిస్తూ చేసిన ప్రతి అంశానికి ఫేస్ బుక్ ద్వారా వివరంగా జవాబులు ఇచ్చారు. వర్మ ఇచ్చిన సమాధానాలు యథాతథంగా...
 
టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి కామెంట్స్ కి నా రిప్లైస్:
ప్రభాకర్ చౌదరి: రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో
RGV : అవునా డాక్టర్ గారు.. మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను.. సారి నా బాడ్

ప్రభాకర్ చౌదరి: కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు.
RGV : అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు?

ప్రభాకర్ చౌదరి: సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి
RGV : ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇచ్చి వుండరు

ప్రభాకర్ చౌదరి: రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి
RGV : ఛా.. మా నాయనే.. ఎవరికీ తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి ..నీ కడుపు చల్లగుండ

ప్రభాకర్ చౌదరి: ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు
RGV : అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే NTR గారిని తిట్టినా ఫర్వాలేదా ? నీ తస్సాదియ్యా

ప్రభాకర్ చౌదరి: నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం
RGV : ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పాడతారా?

ప్రభాకర్ చౌదరి: దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి.
RGV : అబ్బో.. సినిమా పట్ల మీకున్న ఈ అత్యంత అమోఘమైన అవగాహన చూస్తుంటే రాజమౌళి పొట్ట కూడా కొట్టేడట్టు వున్నారు మీరు..బాబోయ్

ప్రభాకర్ చౌదరి: లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది.
RGV : ‘ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న, వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు’..ఈ కామెంట్ని అర్థం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా.
వర్మ

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more