Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శునకాలు సల్మాన్‌కి సోద‌రుల్లాంటి వారు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జుబైర్ ఖాన్‌

  • త‌న‌ను శున‌కం కంటే హీన‌మైన వాడిగా పోల్చ‌డంపై స్పందించిన జుబైర్‌
  • స‌ల్మాన్ దేవుడేం కాద‌ని వ్యాఖ్య‌
  • టీఆర్పీల కోసం త‌న‌ని వాడుకున్నార‌న్న జుబైర్‌
హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11 నుంచి ఎలిమినేట్ అయిన జుబైర్ ఖాన్ బ‌య‌టికి వ‌చ్చాక బిగ్‌బాస్ వ్యాఖ్యాత స‌ల్మాన్‌పై కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. షోలో త‌న‌ని కించ‌ప‌రిచినందుకు స‌ల్మాన్ క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేయాల‌ని కూడా జుబైర్ కోరాడు. దీనికి స్పంద‌న‌గా స‌ల్మాన్ ఇటీవ‌ల బిగ్‌బాస్ కార్య‌క్ర‌మంలో జుబైర్ (పేరు సంబోధించకుండా)ను శున‌కం కంటే హీనమైన వాడిగా పోల్చాడు. దీనిపై జుబైర్ మ‌ళ్లీ స్పందించాడు.

`స‌ల్మాన్ త‌న సోద‌రులైన శున‌కాల‌కు క్ష‌మాప‌ణ చెప్పుకున్నాడు. అలా జ‌ర‌గ‌డానికి కార‌ణం నేనే. అందుకు నాకు కృత‌జ్ఞ‌త‌లు తెలపండి. కార్య‌క్ర‌మంలో ఆయ‌న చ‌మ‌త్కారాల‌పై నేను ఇంత‌కంటే ఎక్కువ మాట్ల‌డ‌ను. అయినా స‌ల్మాన్ దేవుడేం కాదు. ఇత‌రుల‌ను కించ‌ప‌ర‌చ‌డానికి` అని అన్నాడు. అంతేకాకుండా తాను దావూద్‌కి ద‌గ్గ‌రి బంధువున‌ని ప్ర‌చారం చేసి, క‌లర్స్ టీవీ, బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేశార‌ని ఆరోపించాడు. త‌న‌ను టీఆర్పీలు పెంచుకోవ‌డం కోసం వాడుకుని ఇప్పుడు ఫోన్ చేస్తే కాల్ కూడా ఎత్త‌డం లేద‌ని తెలిపాడు.
salman khan
bigboss 11
hindi
zubair khan
dawood ibrahim

More Telugu News