నాగపూర్ లోని నితిన్ గడ్కరీ ఇంటికి వెళుతున్న చంద్రబాబు!
- విదేశీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పు
- పోలవరం ప్రాజెక్టుకు సత్వర నిధుల కోసం గడ్కరీ ఇంటికి
- విశాఖ టూ ఢిల్లీ... వయా నాగపూర్
- చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని
రాష్ట్రానికి పోలవరం ఆవశ్యకతను వివరించి, గుత్తేదారు సంస్థల జాప్యం వల్ల కలుగుతున్న నష్టాన్ని ఆయనకు వివరించనున్నారు. మరికాసేపట్లో విజయవాడ నుంచి బయలుదేరే చంద్రబాబు, తొలుత నాగపూర్ కు వెళ్లి, గడ్కరీ నివాసంలో కాసేపు గడిపిన అనంతరం, ఢిల్లీకి బయలుదేరి వెళతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను త్వరగా తెచ్చుకోవడం, మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే చంద్రబాబు ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
కాగా షెడ్యూల్ ప్రకారం, నేడు విశాఖపట్నం నుంచి చంద్రబాబు డైరెక్టుగా ఢిల్లీకి బయలుదేరాల్సి వుంది. మారిన షెడ్యూల్ నేపథ్యంలో ఆయన రాత్రే విజయవాడ చేరుకున్నారు.