బుట్టా రేణుకపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు!
- జగన్ వెంటే ఉంటానని చెప్పిన మాటలు ఏమయ్యాయి?
- పార్టీ మారిన వారికి టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతుందో తెలుసుకోవాలి
- టీడీపీ కార్యకర్తలు కూడా మర్యాద ఇవ్వరు
తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ... మరి, తను ఎంపీగా గెలిచిన మూడో రోజే ఆమె భర్త టీడీపీ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెందుంటామో గుర్తించాలని రామయ్య అన్నారు. విపక్ష నేతలను సంతలో పశువుల మాదిరిగా కొనడమే పనిగా పెట్టుకున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ నేతల్లో దడ మొదలైందని అన్నారు. వైసీపీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవలేదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని తెలిపారు.