విజయ్ 'మెర్సెల్' రిలీజ్ డౌటే అంటున్నారు .. కారణాలు ఇవే!

16-10-2017 Mon 15:42 | Entertainment
  • విజయ్ తాజా చిత్రంగా రూపొందిన 'మెర్సెల్'
  • భారీ బడ్జెట్ .. భారీ తారాగణం 
  • పావురాలను ఉపయోగించారంటూ అభ్యంతరం 
  • కథ నాదేనంటూ హైకోర్టులో పిటిషన్
విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్' రిలీజ్ కి వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఈ టైటిల్ నాదేనంటూ ఒక వ్యక్తి కేసు వేయడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం నుంచి బయటపడిన ఈ సినిమా, ఇక 'దీపావళి' పండుగకి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అనుకున్నారు. కానీ మరో రూపంలో మళ్లీ ఆటంకాలు ఎదురవుతున్నాయి.

 ఈ సినిమాలో పావురాలను ఉపయోగించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. జంతు సంరక్షణ సంస్థల నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్ ను తెచ్చుకోవాలని సూచించింది. ఇక ఇదిలా వుంటే ఈ కథ తనదేనంటూ నిర్మాతలపై ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దాంతో ఈ సినిమా దీపావళికి విడుదలవుతుందా .. లేదా? అనే డౌట్ అభిమానులను కలవరపెడుతోంది. తెలుగులోనూ ఈ సినిమా 'అదిరింది' పేరుతో రానున్న సంగతి తెలిసిందే.       
vijaykajal

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more