ఎవరైనా నాకు రెస్పెక్ట్ ఇస్తే భయం వేస్తుంది : రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరైనా నాకు రెస్పెక్ట్ ఇస్తే భయం వేస్తుంది : రామ్ గోపాల్ వర్మ

  • నాకసలు రెస్పెక్ట్ ఉందా అనేదే తెలియదు
  • ఐ హేట్ రెస్పెక్ట్
  •  కొంపదీసి మంచి సినిమా తీస్తే అలా మాట్లాడతా
  • దాంతో వెంటనే కిందికి లాగేస్తారు  
రామ్ గోపాల్ వర్మ చేస్తోన్న ట్వీట్ల గురించిన ప్రస్తావన తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో వచ్చింది. ఈ రకమైన ధోరణి వలన ఆయన పట్ల రాన్రాను రెస్పెక్ట్ పోతుంది కదా? అనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు వర్మ స్పందిస్తూ .. "అసలు నాకు రెస్పెక్ట్ ఉందా అనేదే తెలియదు .. ఐ హేట్ రెస్పెక్ట్ " అనేశారు.

 "ఒక ఉదాహరణ చెబుతాను .. విశ్వనాథ్ గారు 'శంకరాభరణం' తీశాక ఆయనకి శాలువ కప్పి సన్మానించారు. అందువలన వాళ్ల అంచనాలను రీచ్ కావడానికి ఆ తరువాత ఆయన బందీ అయిపోతారు. నేనేం చేస్తానంటే .. కొంపదీసి మంచి సినిమా గనుక తీస్తే . . వెంటనే హీరోయిన్ తొడల గురించి మాట్లాడేస్తాను. ఆటోమేటిగ్గా నన్ను కిందకి లాగేసి .. మనోడు ఇక్కడే వున్నాడ్రా" అని చెప్పేసుకుంటారు. "ఎవరైనా కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే నాకు భయం వేసేస్తుంది .. ఎక్కడ ఇమేజ్ చట్రంలో ఇరికించేసి నా కెరియర్ ను ఫినిష్ చేస్తారోనని" అంటూ చెప్పుకొచ్చారు.          
ramgopal varma

More Telugu News