బాలయ్య చేతుల మీదుగా 'గరుడ వేగ' ట్రైలర్ రిలీజ్!

16-10-2017 Mon 10:31 | Entertainment
  • రాజశేఖర్ హీరోగా రూపొందిన 'గరుడ వేగ'
  • కథానాయికగా పూజా కుమార్ 
  • సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ హైలైట్
  • వచ్చేనెల 3న విడుదల       
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడ వేగ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు (మంగళవారం) రాత్రి 8 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

 ఈ కారణంగా ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందనే నమ్మకంతో వున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో పూజా కుమార్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.      
rajasekharbalakrisha

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more