అలాంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నా!: హాలీవుడ్ నిర్మాత ఉదంతంపై హిల్లరీ క్లింటన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలాంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నా!: హాలీవుడ్ నిర్మాత ఉదంతంపై హిల్లరీ క్లింటన్

  • హార్వే వీన్ స్టీన్ నాలుగేళ్లుగా మాకు తెలుసు
  • అలాంటి వాడని అనుకోలేదు
  • ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల సమస్య ఉంది
  • తన ఎన్నికల ప్రచారానికి 16,000 డాలర్లు విరాళంగా ఇచ్చారు
హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వీన్ స్టైన్ పలువురు హీరోయిన్లపై అత్యాచారం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో దానిపై మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై  హిల్లరీ క్లింటన్ విమర్శలు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే, వీన్‌ స్టైన్‌ తమను లైంగికంగా వేధించాడని పలువురు నటీమణులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా హిల్లరీ క్లింటన్ ను ఈ ఘటనపై స్పందన తెలపాలని కోరింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపుల సమస్య ఉందని ఆమె తెలిపారు. గత నాలుగేళ్లుగా హార్వే తమకు తెలుసని ఆమె అన్నారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు తన భర్తతో కలిసి వెళ్లేదానినని అమె అన్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఆయన 16,000 డాలర్లు విరాళంగా ఇచ్చారని ఆమె అన్నారు.

అలాంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నానని ఆమె చెప్పారు. కేవలం హార్వే మాత్రమే కాదని, గతంలో లైంగికంగా వేధించానని అంగీకరించిన వ్యక్తిని దేశాధ్యక్షుడిని చేశారని ఆమె ఎద్దేవా చేశారు. హార్వే విరాళంగా ఇస్తానన్న 1600 డాలర్లను ఉమెన్స్‌ ఛారిటీకి విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరానని ఆమె తెలిపారు. 
producer
america
hillery clinton
rape

More Telugu News