హైదరాబాద్ లో భారీగా భూ అక్రమాలకు పాల్పడుతోన్న ముఠా అరెస్టు
- ఖాళీగా ఉన్న స్థ‌లంపై క‌న్ను
- ఎంతో హుందాగా న‌టిస్తూ చివ‌రికి టోపీ పెట్టేస్తోన్న నిందితులు
- న‌కిలీ ప‌త్రాలు సృష్టించి భూ అక్ర‌మాలు
- ఆరుగురి అరెస్టు.. పరారీలో నలుగురు
హైదరాబాద్లో భూ అక్రమాలకు పాల్పడుతూ కలకలం రేపుతోన్న ఓ ముఠాను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఖాళీగా ఉన్న స్థలంపై కన్ను వేస్తోన్న ఈ కేటుగాళ్లు ఆ భూమి తమదేనని చెప్పుకుంటూ కస్టమర్ల వద్ద ఎంతో హుందాగా నటిస్తూ చివరికి టోపీ పెట్టేస్తున్నారు. నగరంలోని బంజారా హిల్స్ లో భూమి ధరలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ భూమి కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. బంజారా హిల్స్లోనూ ఈ కేటుగాళ్లు వెయ్యి గజాల స్థలం కాజేశారంటే వీరు చేస్తోన్న మోసం ఏపాటిదో తెలుసుకోవచ్చు.
నకిలీ పత్రాలు సృష్టించి వీరు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న ఎస్ఆర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు మోసానికి పాల్పడ్డ నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.