వాడు కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉంది: రోజా సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాడు కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉంది: రోజా సంచలన వ్యాఖ్యలు

  • ఏం! మేము టీడీపీ నేతల పెళ్లాలకి గుండ్లు కొట్టిన ఫోటోలు పెట్టలేమా? 
  • వాడు ఒక అబ్బ, అమ్మలకి పుట్టినోడైతే ఇలా చేయడు
  • వాడు కనిపిస్తే అప్పుడు చెబుతాను
సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా ప్రత్యర్థులను రెచ్చగొట్టడంలో నేర్పరి. సినీ నటి కావడంతో అవసరమైనప్పుడు తన భావాలు ఎదుటివారికి కనబడనీయకుండా జాగ్రత్తపడడం. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. దీంతో ముక్కుపుటాలు అదురుతుండగా...'ఆ వెధవ ఎవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉంద'ని రోజా మండిపడ్డారు. టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రోజాకు గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూపించిన మురళీకృష్ణ...ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందని ప్రశ్నించాడు. దీంతో వెంటనే తీవ్రఆగ్రహానికి గురైన రోజా.. ముక్కుపుటాలు అదురుతుండగా..వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు.

 ఏం మేము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా? అని ఆమె ప్రశ్నించారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా?...వాడిని ఏం చెయ్యాలి? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీని అభిమానించడం తప్పుకాదని చెప్పిన ఆమె, ఇలాంటి కుసంస్కారులు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారని ఆమె మండిపడ్డారు. ఈ ఎపిసోడ్ రేపు ఆ టీవీలో ప్రసారం కానుంది.
roja
fire
ysrcp
interview

More Telugu News