ప్రియుడిని బెదిరించి ప్రియురాలిపై అత్యాచారం చేసిన తాగుబోతులు!

ప్రియుడిపై దాడి చేసి, బెదిరించి, ప్రియురాలిపై అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కాంచీపురం జిల్లా పవుంజూరు గ్రామానికి చెందిన యువకుడు తన ప్రియురాలి (22) ని సెయ్యూర్‌ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ మాట్లాడుకుంటుండగా వారిని గమనించిన ఆరుగురు యువకులు పూటుగా తాగి రెండు బైకులపై వెళ్లారు.

ముందుగా ప్రియుడిపై కత్తితో దాడి చేసి, బెదిరింపులకు పాల్పడడడంతో ప్రియురాలిని వదిలి అతను పారిపోయాడు. దీంతో ప్రియురాలి మెడపై కత్తిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన యవతిని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, కూవత్తూరు సమీపంలోని పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరోముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. 

rape
rape rescued
tamilnadu
lovers
stabbed
hospitalized

More Telugu News