సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

14-10-2017 Sat 07:23 | Entertainment
  • ప్రధాని కార్యక్రమానికి ప్రచారకర్తగా రకుల్ 
  • 'ఉన్నది ఒకటే జిందగి' ఆడియో వేడుక 
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా ది గ్రేట్'  
  • అమెరికాలో నితిన్ షూటింగ్ పూర్తి 
*  అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఓ అరుదైన ఛాన్స్ అందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'భేటీ బచావో.. భేటీ పడావో' జాతీయ కార్యక్రమానికి రకుల్ ను తమ రాష్ట్రం నుంచి బ్రాండ్ అంబాసడార్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఉన్నది ఒకటే జిందగి' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రంలోని నటీనటులతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు.
*  రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'రాజా ది గ్రేట్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A  సర్టిఫికేట్ లభించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ నాయికగా నటించింది. ఈ నెల 19న దీనిని విడుదల చేస్తున్నారు.
*  నితిన్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ అమెరికాలో ముగిసింది. నెల రోజులకు పైగా అక్కడ ఈ షెడ్యూలు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.     
Rakulramraviteja

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more