పాదయాత్రతో కాళ్ల నొప్పులు తప్ప.. మరేం రాదు: జగన్ పై ఆదినారాయణరెడ్డి సెటైర్లు
- పాదయాత్ర వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదు
- వైసీపీ కనుమరుగు కావడం ఖాయం
- 3 వేలు కాదు 30 వేల కి.మీ. నడిచినా ఉపయోగం లేదు
నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగనుంది. ఆరు నెలల పాటు దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం ఆయన నడవనున్నారు.