radhika apte: ఓ దక్షిణాది నిర్మాత నన్ను పడకగదికి రమ్మన్నాడు: నటి రాధికా ఆప్టే

  • ఓ నిర్మాత నన్ను ఒత్తిడి చేశాడు
  • నేను అంగీకరించలేదు
  • దక్షిణాదిలో ఇలాంటివి ఎక్కువ
రాధికా ఆప్టే... బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో నటిస్తూ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరుగాంచింది. తెలుగులో బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్ భార్యగా మెప్పించింది. అయితే, ఈమెకు ఫ్రీ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. సద్దుమణిగిన వివాదాలను కూడా తెరపైకి తెస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

తాజాగా ఆమె మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉందని ఆమె కామెంట్ చేసింది. తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని... కథా చర్చలకు పిలిచిన ఓ నిర్మాత తనను పడక గదికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. అయితే, తాను అంగీకరించలేదని తెలిపింది. ఈ కారణం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రాలేదని చెప్పింది.
radhika apte
tollywood
bollywood
sexual abuse

More Telugu News