చైనా ఆన్లైన్ స్టోర్ వస్త్రాల డిజైన్లను కాపీ కొట్టిన అనుష్క శర్మ?
- `నుష్` పేరుతో వస్త్రాల డిజైన్లను విడుదల చేసిన అనుష్క శర్మ
- డిజైన్ల ఫొటోలను షేర్ చేసిన నటి
- కాపీ విషయాన్ని కనిపెట్టిన నెటిజన్లు
తన శైలికి తగ్గట్టుగా, తనను బాగా ఆకట్టుకున్న కొన్ని వస్త్రాలను ఆదర్శంగా తీసుకుని ఈ డిజైన్లను రూపొందించినట్లు ఆమె పేర్కొంది. అయితే ఈ డిజైన్లన్నీ ఆదర్శంగా తీసుకుని రూపొందించినవి కావని, చైనా ఆన్లైన్ స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కొన్ని వస్త్రాల డిజైన్లను కాపీ కొట్టి రూపొందించినవని నెటిజన్లు కనిపెట్టేశారు. ఆమె మొత్తం 160 వస్త్రాల డిజైన్ల ఫొటోలను షేర్ చేయగా వాటిలో కొన్ని అచ్చు గుద్దినట్టు అలీబాబా ఎక్స్ప్రెస్ వెబ్సైట్లో ఉన్న వస్త్రాల లాగే ఉన్నాయి. ఒక్క `నుష్` అనే బ్రాండ్ పేరు మినహా మిగతా డిజైన్ అంతా ఒకేలా ఉండటంతో నెటిజన్లు జోకులేస్తున్నారు.