Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ తో చేయించే ఆలోచనలో వర్మ?

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాణం దిశగా వర్మ
  • నటీనటుల ఎంపిక ప్రక్రియపై దృష్టి
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి      
ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాలకి సంబంధించిన నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా చేయడానికి రామ్ గోపాల్ వర్మ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. రాకేష్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

 ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ తో చేయించాలనే ఆలోచనలో వర్మ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు .. హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆయనైతే ఎన్టీఆర్ పాత్రకి కరెక్ట్ గా సెట్ అవుతాడని వర్మ భావిస్తున్నాడట. ప్రకాశ్ రాజ్ తో సంప్రదింపులు జరపడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఇది నిజమే అయితే .. వివాదాస్పదమైన ఈ సినిమాలో నటించడానికి ప్రకాశ్ రాజ్ ఒప్పుకుంటాడా? అనేదే ఆసక్తికరంగా మారింది. ఇక లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనే ఆత్రుత పెరుగుతోంది.     
ramgopal varma

More Telugu News