అత్యాచారం చేసి.. ఆస్తి రాయించుకున్నాడని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన తెలంగాణ మహిళ
- ఢిల్లీలో లోధీ ఎస్టేట్ లో పనిమనిషిగా పని చేస్తున్న తెలంగాణ మహిళ
- మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్న లోధీ ఎస్టేట్ మేనేజర్
- 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆమె ఇంటిని తన పేరిట రాయించుకున్న మేనేజర్ సుభాష్
ఆ తరువాత 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె ఇంటిని కూడా రాయించుకున్నాడు. డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూసిన ఆమె నిలదీయడంతో అతను చేసిన మోసం వెలుగు చూసింది. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. తనపై నాలుగు సార్లు అత్యాచారం చేసి, తన ఆస్తిని రాయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.