అత్యాచారం చేసి.. ఆస్తి రాయించుకున్నాడని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన తెలంగాణ మహిళ
Add ap7am to your home Screen

అత్యాచారం చేసి.. ఆస్తి రాయించుకున్నాడని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన తెలంగాణ మహిళ

  • ఢిల్లీలో లోధీ ఎస్టేట్ లో పనిమనిషిగా పని చేస్తున్న తెలంగాణ మహిళ
  • మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్న లోధీ ఎస్టేట్ మేనేజర్ 
  • 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆమె ఇంటిని తన పేరిట రాయించుకున్న మేనేజర్ సుభాష్
తనపై అత్యాచారం చేయడమే కాకుండా తన ఆస్తిని కూడా రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఒక తెలంగాణ మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ లో సుభాష్ అనే యువకుడు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆ ఎస్టేట్ లో తెలంగాణాకు చెందిన మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెకు సుభాష్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.

ఆ తరువాత 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె ఇంటిని కూడా రాయించుకున్నాడు. డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూసిన ఆమె నిలదీయడంతో అతను చేసిన మోసం వెలుగు చూసింది. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. తనపై నాలుగు సార్లు అత్యాచారం చేసి, తన ఆస్తిని రాయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
delhi
telangana
lodhi estate
lady rape
cheating

More Telugu News