అమెరికాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న చైనా.. ఉత్తర కొరియాకు మొండిచేయి చూపిస్తోంది: అంతర్జాతీయ మీడియా
- ఉత్తర కొరియా శరణార్థులను అడ్డుకుంటున్న చైనా
- సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు
- కంచె ఏర్పాటు
- భారం తగ్గించుకోవడానికే అన్న చైనా
ప్రస్తుతం అమెరికాకు చైనా పూర్తిగా సహకరిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో తననే నమ్ముకున్న ఉత్తర కొరియాకు మొండిచేయి చూపుతోందని తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి ఆంక్షల మేరకే తాము ఈ పని చేస్తున్నామని చైనా అంటోంది. కొరియా శరణార్థులకు తాము ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవమేనని... అయితే, అది గతం మాత్రమేనని చెప్పింది. అధిక జనాభాతో తాము సతమతమవుతున్నామని... అదనపు భారాన్ని తగ్గించుకునే క్రమంలోనే ఈ పని చేశామని తెలిపింది.