బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆసుపత్రికి పీవీ సింధు విరాళం

  • రూ. 25 ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించిన బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి
  • కేబీసీలో గెలుపొందిన మొత్తాన్ని కేన్స‌ర్ బాధితుల కోసం ఇచ్చిన సింధు
  • వెల్ల‌డించిన ఆసుప‌త్రి వ‌ర్గాలు
ఇటీవ‌ల అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి` కార్య‌క్ర‌మంలో బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ గ్ర‌హీత పీవీ సింధు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మంలో తాను గెల్చుకున్న రూ. 25 ల‌క్ష‌ల మొత్తాన్ని కేన్స‌ర్ బాధితుల చికిత్స కోసం విరాళంగా అంద‌జేసింది. హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆసుప‌త్రికి ఆమె ఈ విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఆసుప‌త్రి వ‌ర్గాలు ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేశాయి. సింధు విరాళాన్ని ప్ర‌క‌టించ‌డంతో ఆసుప‌త్రి వ‌ర్గాలు హర్షం వ్య‌క్తం చేశాయి. అదే బాట‌లో మ‌రికొంత మంది ప్ర‌ముఖులు కేన్స‌ర్ బాధితుల కోసం విరాళాలు ఇవ్వ‌డానికి ముందుకొస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు.
Go Back to Shorts
pv sindhu
kbc
amitabh bachan
twitter
shooting
donation
basavatharakam
cancer

More Telugu News