ఆన్లైన్లో యోగామ్యాట్ ఆర్డర్ చేస్తే.. రెండున్నర కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చాయి!
- అమెరికాలోని యార్క్ కౌంటీలో ఘటన
- పార్సిల్ విప్పి అవాక్కయిన మహిళ
- రెండు సంచుల్లో 20 వేల పిల్స్
ఒక్కోదాంట్లో పదివేల పిల్స్ ఉన్న రెండు సంచులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో పిల్ విలువ 20 డాలర్లు ఉంటుందని, వాటి మొత్తం విలువ 4 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.6 కోట్లు) ఉంటుందని చెప్పారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న యార్క్ కౌంటీ మల్టీజ్యూరిస్ డిక్షనల్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. డ్రగ్స్ కాలిఫోర్నియా నుంచి వచ్చినట్టు యూనిట్ కమాండర్ మార్విన్ బ్రౌన్ తెలిపారు. తనపేరు, అడ్రస్‌ను ఉపయోగించుకుని ఎవరో ఈ పనిచేసి ఉంటారని బాధిత మహిళ తెలిపింది. ఆమె పేరును వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.