అంగరంగవైభవంగా జరిగిన చైతూ- సమంతల వివాహం... సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
- వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య ఒక్కటైన నాగచైతన్య, సమంత
- పెళ్లి ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన నాగార్జున
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
వందమంది అతిథుల సమక్షంలో సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేశాడు. సరిగ్గా రాత్రి 11:52 నిమిషాలకు వివాహం జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ దంపతులు నాగచైతన్య, సమంతలపై అభిమానులు అభినందనలు, శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫొటోలు మీరు కూడా చూడండి.