హాల్ టికెట్ మీద అభ్యర్థి ఫోటోకి బదులు గ‌ణ‌ప‌తి బొమ్మ‌... బీహార్ యూనివ‌ర్సిటీ నిర్వాకం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాల్ టికెట్ మీద అభ్యర్థి ఫోటోకి బదులు గ‌ణ‌ప‌తి బొమ్మ‌... బీహార్ యూనివ‌ర్సిటీ నిర్వాకం!

  • బొమ్మ మాత్ర‌మే కాదు సంత‌కం కూడా దేవుడిదే
  • లలిత్ నారాయ‌ణ్ మిథిలా యూనివ‌ర్సిటీ అధికారుల నిర్ల‌క్ష్యం
  • మీడియాను ఆశ్ర‌యించిన విద్యార్థి
అక్టోబ‌ర్ 9 నుంచి ప‌రీక్ష‌లు కావ‌డంతో బీహార్‌లోని ద‌ర్భంగా వ‌ద్ద ఉన్న ల‌లిత్ నారాయ‌ణ్ మిథిలా యూనివ‌ర్సిటీలో బీకాం చ‌దువుతున్న కృష్ణ కుమార్ రాయ్ హాల్ టికెట్ తీసుకోవ‌డానికి క‌ళాశాలకు వెళ్లాడు. అంద‌రిలాగే హాల్ టికెట్ తీసుకుని ఇంటికి బ‌య‌ల్దేరాడు. ఒక్క‌సారి ప‌రీక్ష‌ల తేదీలు స‌రిచూసుకుందామ‌ని హాల్ టికెట్ తెరిచాడు. లోప‌ల త‌న ఫొటో స్థానంలో వినాయ‌కుడి చిత్రం ఉండ‌టం చూసి షాక్ తిన్నాడు.

అంతేకాదు.. సంత‌కం కూడా `గ‌ణేశ్‌` అని ఇంగ్లీష్‌లో ఉండ‌టంతో ఆశ్చ‌ర్య‌పోయాడు. త‌న ఇంటి చిరునామాలో కూడా త‌ప్పులు ఉండ‌టంతో వెళ్లి యూనివ‌ర్సిటీ ప‌రీక్షా విభాగాన్ని సంప్ర‌దించాడు. అయితే అతని గోడును అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మీడియాను ఆశ్ర‌యించాడు. `నేను ద‌ర‌ఖాస్తు చేసుకునేట‌ప్పుడు అన్నీ సరిగానే నింపాను. హాల్ టికెట్ ఇలా రావడంతో ఆశ్చ‌ర్య‌పోయాను. కొత్త హాల్‌టికెట్ కోసం వెళ్తే ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు నా ప‌రీక్ష వినాయ‌కుడు వ‌చ్చి రాస్తాడా?` అని కృష్ణ ప్ర‌శ్నించాడు.

ఈ విష‌యం గురించి యూనివ‌ర్సిటీ అధికారులు మాట్లాడుతూ హాల్‌టికెట్ల ముద్ర‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఇంట‌ర్నెట్ సెంట‌ర్ ఈ త‌ప్పిదం చేసి ఉంటుంద‌ని అన్నారు.
hall ticket
ganesh
photo
lalit narayan mithila university
bihar

More Telugu News