ప్రధాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశ్ రాజ్‌పై కేసు

  • కేసు వేసిన న్యాయ‌వాది
  • ల‌క్నో కోర్టులో న‌మోదు
  • అక్టోబ‌ర్ 7న విచార‌ణ‌
పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హ‌త్య విష‌యంలో ప్ర‌ధాని మోదీ మౌనం వ‌హిస్తున్నార‌ని, ఆయ‌న పెద్ద న‌టుడ‌ని ఇటీవ‌ల‌ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ ఆయ‌న మీద కేసు దాఖ‌లైంది. ల‌క్నోకు చెందిన ఓ న్యాయవాది అక్క‌డి కోర్టులో కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విచార‌ణ అక్టోబ‌ర్ 7న జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తనకు మూడు దశాబ్దాలుగా తెలుసని, ఆమెను హత్యచేసిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. ఆయన తనకంటే పెద్ద నటుడని అన్నారు. గౌరీ లంకేశ్ హత్యపై మోదీ మౌనానికి  నిరసనగా తాను అందుకున్న జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ మంగళవారం తోసిపుచ్చారు. తనకొచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేంత మూర్ఖుడిని కాదని స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
prakash raj
gouri lankesh
case
uttar pradesh
luknow
modi

More Telugu News