రియల్ ఫాదర్, రీల్ ఫాదర్లతో ధోనీ.... ట్విట్టర్లో ఫొటో షేర్ చేసిన అనుపమ్ ఖేర్
- ధోనీ ఆతిథ్యాన్ని మెచ్చుకున్న నటుడు
- సాక్షి, ధోనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్
- వారి కూతుర్ని పొగుడుతూ మరో ట్వీట్
ధోనీ జీవిత కథ ఆధారంగా వచ్చిన `ఎంఎస్ ధోనీ` చిత్రంలో అనుపమ్ ఖేర్ ధోనీ తండ్రిగా నటించారు. ఆ ఫొటోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. `ధోనీ, సాక్షి.... మీ ఆతిథ్యం చాలా బాగుంది. మీ కొత్త ఇల్లు నాకు బాగా నచ్చింది` అంటూ ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు... ధోనీ, సాక్షిల గారాల పట్టి జీవ గురించి కూడా ఆయన ట్వీట్ చేశాడు. `జీవ చాలా తెలివైంది. బాగా పాడుతుంది. జాతీయ గీతాన్ని చాలా గట్టిగా పాడింది` అంటూ అనుపమ్ పోస్ట్ చేశాడు.