కాలం మారింది... వేమన మాట మారుతోంది... 'ఖరము'పాలకి మహా డిమాండ్!
- ఆవుపాలు 44 రూపాయలే
- గాడిదపాలు లీటర్ వెయ్యి రూపాయలు
- అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో జోరుగా వ్యాపారం
- 50 ఎంఎల్ గాడిదపాలు 50 రూపాయలు
అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో గాడిదపాలు తాగితే సర్వరోగాలు నయమవుతాయని ప్రచారం చేస్తూ మంచిర్యాలకు చెందిన వడియాల రాజులు విక్రయం సాగిస్తున్నాడు. 50 ఎంఎల్ పాలు 50 రూపాయలకు అమ్ముతున్నాడు. 40 గాడిదలతో మకాం వేసిన రాజులు వాటిని వీధుల్లో తిప్పుతూ అడిగిన వారికి పాలు పితికి ఇస్తున్నాడు. పాలలో ఆయుర్వేద దినుసులు కలిపి ఇస్తూ, అవి తాగితే ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయని ప్రచారం చేస్తున్నాడు. దీంతో గాడిదపాలు మంచి ధరపలుకుతున్నాయి.