చంద్రబాబు 15 లక్షల కోట్లు వెనకేసుకున్నారు: జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి

  • అభివృద్ధి పేరుతో కొల్లగొడుతున్నారు
  • నాలుగేళ్లు అవుతున్నా హామీలను నెరవేర్చలేదు
  • 'వైఎస్ఆర్ కుటుంబం'లో 75 లక్షల మంది చేరిక 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ మేనమామ, వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా... మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని విమర్శించారు.

పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులను వెంటనే చేపట్టి, పూర్తిచేయాలని... దిగువకు 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్సార్ దేనని చెప్పారు. సీమకు నీటిని అందిస్తున్నది తామేనంటూ టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని... శ్రీశైలం రిజర్వాయర్ లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ... పోతిరెడ్డిపాడుకు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 'వైఎస్ఆర్ కుటుంబం'లో ఇప్పటి వరకు 75 లక్షల మంది భాగస్వాములు అయ్యారని... ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
chandrababu
Telugudesam
ysrcp
ys jagan
mla ravindranath reddy

More Telugu News