Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్వామ్యాన్ లుక్‌ని కాపీ కొట్టారు... 'అల్లావుద్దీన్ ఖిల్జీ' పోస్ట‌ర్ గురించి నెటిజ‌న్లు

  • ఇషాంత్ శ‌ర్మ‌, కేజ్రీవాల్‌ల‌తో కూడా పోలిక‌
  • వివిధ ర‌కాల కామెంట్లు చేస్తున్న ట్విట్ట‌ర్ జ‌నాలు
  • న‌వ్వు తెప్పిస్తున్న ఫొటోలు
బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ వ‌స్త్ర‌ధార‌ణను హేళ‌న చేస్తూ ఇంట‌ర్నెట్‌లో ఎన్నో కామెంట్లు క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు `ప‌ద్మావ‌తి` సినిమాలో అత‌ని అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్‌ను కూడా చాలామంది నెటిజ‌న్లు హేళ‌న చేస్తున్నారు. ర‌ణ్‌వీర్ లుక్ హాలీవుడ్ సినిమా `జ‌స్టిస్ లీగ్`లో ఆక్వామ్యాన్ లుక్‌ని త‌ల‌పిస్తోంద‌ని, బాలీవుడ్ మ‌ళ్లీ హాలీవుడ్ నుంచి కాపీ కొట్టింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

అంతేకాకుండా ఆ ఫ‌స్ట్‌లుక్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ జుట్టు చూస్తే బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ గుర్తొస్తున్నాడ‌ని అంటున్నారు. వారి వాద‌న‌కు సాక్ష్యంగా కొన్ని ఫొటోల‌ను కూడా నెటిజ‌న్లు పోస్ట్ చేస్తున్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ ఫొటోతో ర‌ణ్‌వీర్ సింగ్ లుక్‌ను పోల్చిన ఫొటో చాలా న‌వ్వు తెప్పిస్తోంది. డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న `ప‌ద్మావ‌తి` సినిమాలో కీల‌క‌మైన మూడు పాత్ర‌ల ఫ‌స్ట్‌లుక్‌లు విడుద‌ల‌య్యాయి. ప‌ద్మావ‌తిగా దీపికా, ఆమె భ‌ర్త మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌ల లుక్‌లు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. ఈ రెండు ఫ‌స్ట్‌లుక్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.
Padmavati
Ishant Sharma
Kejriwal
Twitter
Ranveer Singh
Aquaman

More Telugu News