Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెనక్కి తగ్గిన సునీల్ నిర్మాతలు .. తమిళ రీమేక్ డౌటే!

  •  తమిళంలో హిట్ కొట్టిన 'చతురంగ వేట్టై'
  •  సునీల్ తో రీమేక్ చేయాలనుకున్న నిర్మాతలు
  •  ఈ ప్రాజెక్టుపై 'ఉంగరాల రాంబాబు' ఫ్లాప్ ప్రభావం
  •  వెనక్కి తగ్గిన నిర్మాతలు
తమిళంలో ఈ మధ్యకాలంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రాలలో 'చతురంగ వేట్టై' ఒకటి. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే సినిమా ఇది. ఈ సినిమాను సునీల్ కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమేననే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 హాస్యాన్ని పండించడంలో సునీల్ కి తిరుగులేదనే సంగతి తెలిసిందే. అలాంటి కామెడీ నేపథ్యంతో ఆయన చేసిన సినిమాలే పరాజయం పాలవుతున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఉంగరాల రాంబాబు' కూడా అదే బాటలో నడిచింది. ఈ నేపథ్యంలో ఆయనతో 'చతురంగ వేట్టై' వంటి థ్రిల్లర్ మూవీ చేయడం సాహసమే అవుతుందనే ఆలోచన చేసిన నిర్మాతలు వెనక్కి తగ్గారట. ఈ రీమేక్ ను మరో హీరోతో చేస్తారా? లేదంటే ఆ కథను పక్కన పెట్టేస్తారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.      
sunil

More Telugu News