శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు

  • ఈ తెల్లవారుజామున దాడికి దిగిన ఉగ్రవాదులు
  • కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం
శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ ట్రాన్సిట్ క్యాంప్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు కాల్చి చంపారు.

తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించడంతో క్యాంపస్‌లోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారభించారు. జవాన్లు కూడా దీటుగా స్పందిస్తూ, కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రదాడి కారణంగా ఎయిర్‌పోర్టు వైపు వాహనాలను, వ్యక్తులను అనుమతించడం లేదు.
Go Back to Shorts
Srinagar
Airport
attack
BSF camp

More Telugu News