గాంధీకి అత్యంత విలువైన నివాళి సమర్పించిన బాలిక... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
- రూ. 2000, రూ. 500 నోట్ల మీద గాంధీ బొమ్మలు చింపి ప్రాజెక్టు తయారీ
- వివరాలు తెలియకున్నా వైరల్‌గా మారింది
- నవ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
రూ. 2000, రూ. 500 నోట్ల మీద ఉన్న గాంధీ బొమ్మలను చింపి తన ప్రాజెక్టు షీట్లో అంటించింది. ఈ పాప ఎవరు? ఈ ఫొటో ఎక్కడిది? ఒరిజినలా? లేక ఫొటోషాపా? వంటి వివరాలేమీ తెలియక పోయినా ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుస్తున్నారు.
చూడటానికి అచ్చం ఒరిజినల్ మాదిరిగా కన్పిస్తున్న ఈ ఫొటో మీద నెటిజన్లు తమ హాస్య ఛలోక్తులు కురిపిస్తున్నారు. `ఈ ప్రాజెక్టు చూస్తే వాళ్ల టీచర్ మెచ్చుకోవడమేమో గానీ పాప తల్లిదండ్రులు మాత్రం కళ్లుతిరిగి పడిపోతారు`, `గాంధీకి ఇంతకంటే రిచ్‌గా ఎవరూ నివాళి అర్పించలేరు`, `డీమానిటైజేషన్ ద్వారా మోదీ చేయలేని పని, ఈ పాప చేసింది` అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.