టెలిఫోన్ వైర్లు ప‌ట్టుకుని పారిపోవాలనుకున్నాడు... అదృష్టం బాగోలేక మ‌ధ్య‌లో ఇరుక్కున్నాడు... వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెలిఫోన్ వైర్లు ప‌ట్టుకుని పారిపోవాలనుకున్నాడు... అదృష్టం బాగోలేక మ‌ధ్య‌లో ఇరుక్కున్నాడు... వీడియో చూడండి!

  • హోట‌ల్ బిల్లు చెల్లించ‌లేక‌పోవ‌డ‌మే కార‌ణం
  • 19 అంత‌స్తుల పైన అనుకోని విన్యాసం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
చైనాకు చెందిన ఓ వ్య‌క్తి హోట‌ల్ బిల్లు చెల్లించ‌లేక టెలిఫోన్ వైర్లు పట్టుకుని పాకుతూ పారిపోదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను ఉంటున్న అంతస్తు నుంచి పక్కనే వున్న వైర్ల‌ను ప‌ట్టుకుని పాక‌డం ప్రారంభించాడు. కానీ కొద్ది సేప‌టికే రెండు వైర్ల మ‌ధ్య చిక్కుకుపోయాడు. 19 అంత‌స్తుల ఎత్తు మీద వైర్ల చిక్కు విడిపించుకోవ‌డానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాడు.

అలా గాల్లో మెలిక‌లు తిరుగుతూ కింద ఉన్న వారంద‌రినీ భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసిన సంఘ‌ట‌న చైనాలోని గుయ్‌జౌ ప్రాంతంలో జ‌రిగింది. అటు ప‌క్క‌నే కొద్ది దూరంలో హై టెన్ష‌న్ విద్యుత్ వైర్లు కూడా ఉండ‌టంతో ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని ఊహించి అగ్నిమాప‌క సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. త‌మ ద‌గ్గ‌ర ఉన్న యంత్రాల‌తో అతన్ని కాపాడి అదుపులోకి తీసుకున్నారు. అత‌ను చెల్లించాల్సిన బిల్లు ఎంతో స‌రైన వివ‌రాలు తెలియ‌క పోయినా, ప్రాణాలు ప‌ణంగా పెట్టాల్సినంత మొత్తం కాద‌ని స‌మాచారం.

man
china
telephone wires
guizhou
hotel bill

More Telugu News