రెండు నెలల క్రితం కమలహాసన్ నన్ను అడిగి ఉండాల్సింది!: రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రాజకీయాల్లో రాణించాలంటే పేరుప్రతిష్ఠలు ఒక్కటే సరిపోవు
  • బహుశా ఆ రహస్యం కమల్ కి తెలుసనుకుంటున్నాను
  •  రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు 


ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆసక్తి పెంచుతున్నాయి. చెన్నైలో దివంగత సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా విజయం సాధించాలంటే ఇప్పుడున్న కీర్తి ప్రతిష్టలు సరిపోవని అన్నారు. అంతకంటే ఎక్కువ కావాలని, ఆ కావాల్సినవి ఏంటో తనకు తెలియదని ఆయన చెప్పారు.

ఆ రహస్యం కమల్ కు తెలుసని భావిస్తున్నానని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితమే కమలహాసన్ తనతో కలిసి పనిచేయాలని అడిగి ఉండాల్సిందని ఆయన చెప్పారు. తాను మాత్రం రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలని కమల్ ను అడిగానని ఆయన అన్నారు. అప్పుడు కమల్, తనతో వస్తే చెబుతానన్నారని ఆయన తెలిపారు. రజనీకాంత్ వ్యాఖ్యలను కమల్ ఆసక్తిగా వినడం విశేషం. 
Go Back to Shorts
rajani kanth
kamal hasan
politics

More Telugu News