ముంబై బ్రిడ్జి కూలిన ఘటనలో దారుణం.. ప్రాణాలతో పోరాడుతున్న మహిళపై లైంగిక వేధింపులు, చోరీ!
- వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తన
- ఆర్తనాదాలు చేస్తుంటే దోచుకెళ్లిన వైనం
- కాసేపటికే కన్నుమూత
ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.