వెంకటరమణ ట్రావెల్స్ బస్సులో 'స్పైడర్'... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు

  • గుంటూరు నుంచి బయలుదేరిన బస్సులో చిత్ర ప్రదర్శన
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికుడు
  • గన్నవరం వద్ద బస్సును ఆపిన పోలీసులు
గత బుధవారం విడుదలైన మహేష్ బాబు కొత్త చిత్రం 'స్పైడర్' పైరసీ అప్పుడే వచ్చేసింది. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు 'ఏపీ 16 జెడ్ 7337' లో 'స్పైడర్' చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా, పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బస్సు గుంటూరు నుంచి బయలుదేరగానే సినిమాను వేయడంతో, అందులోని ఓ ప్రయాణికుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని ఇచ్చాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం వద్ద మకాం వేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటరులో బస్సును గుర్తించి దాన్ని ఆపారు. చిత్రాన్ని స్టోర్ చేసిన పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకుని బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపామని తెలిపారు. ఘటనపై విచారణ ప్రారంభించామని అన్నారు. కాగా, విడుదలైన మరుసటి రోజే 'స్పైడర్'ను పైరసీ చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
spyder
pairasy
venkataramana travels

More Telugu News