రొమాన్స్ సీన్లు మాత్రం వద్దే వద్దంటున్న ఐశ్వర్యా రాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రొమాన్స్ సీన్లు మాత్రం వద్దే వద్దంటున్న ఐశ్వర్యా రాయ్!

  • గతంలో పలు చిత్రాల్లో నటించిన షారూఖ్, ఐశ్వర్య
  • మరో చిత్రంలో నటించేందుకు ఇరువురి నిరాకరణ
  • విభేదాలు లేవంటూనే 'నో' చెబుతున్నారట!
గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన షారూఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ల జంట మరో చిత్రంలో కలసి నటించాలని వచ్చిన ప్రతిపాదనలను అంగీకరించడం లేదట. తాను నటించాలంటే, హీరో ఎవరైనా, ఒక్క రొమాంటిక్ సీన్ కూడా ఉండరాదని ఐశ్వర్య షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ తనకు నచ్చిన, నప్పేలా ఉండే రోల్స్ ఎంచుకుంటున్న ఐశ్వర్యను, షారూఖ్ నూ మరోసారి కలపాలని మూడు నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇచ్చాయట.

 ఇక తాజాగా 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఈ జంట చివరిసారిగా కనిపించగా, అప్పటి నుంచి షారూఖ్ కూడా ఐశ్వర్యతో కలసి వెండితెరను పంచుకునేందుకు అంగీకరించడం లేదని సమాచారం. కారణం ఏంటన్న విషయం తెలియకున్నా ఆన్ స్క్రీన్ రొమాన్స్ తనకు వద్దని ఈ బిగ్ బీ కోడలు తనను కలిసిన నిర్మాతలకు గట్టిగానే చెబుతోందట. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే, కలసి నటించేందుకు మాత్రం అంగీకారం తెలపడం లేదట. ఇక ఈ విషయంలో నిజాలు తెలియాలంటే, అటు ఐశ్వర్యో, ఇటు షారూఖో నోరు విప్పాల్సిందే.
sharook khan
aishwarya rai

More Telugu News